Public hearings should be addressed immediately-Hanumakonda District Collector Pravinya
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్23
హనుమకొండ: ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 139 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. వి. గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.