April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి విజయం     

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ  సెప్టెంబర్ 23 హన్మకొండ హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ జరిగిన గ్రేటర్ వరంగల్ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా కాసు శ్రీనివాస్ రెడ్డికి 237 ఓట్లు పోలు కాగా ఏరుకొండ పవన్ కుమార్ గౌడ్ కి 166 ఓట్లు పోలైనవి, కాసు శ్రీనివాస్ రెడ్డి 71 ఓట్లతో అధ్యక్షులుగా విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి పంచాగిరి రత్నాకర్ పైన 54 ఓట్లతో జీనుకల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులుగా మానుపటి రమేష్ పైన 67 ఓట్లతో రాసురి రాజేష్, కోశాధికారి గొర్రె కృష్ణ 65 ఓట్లతో చింతల నాగరాజు, సహాయ కార్యదర్శిగా బొక్క సుజిత్ పైన 77 ఓట్లతో శీలం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు – 1 ఉప్పుల దివ్య పైన 64 ఓట్లతో డోలా రాజు, కార్యవర్గ సభ్యులు -2 బొంగు లక్ష్మిపైన 52 ఓట్లతో బూర్గుల ప్రమోద విజయం సాధించినట్లు వరంగల్ గ్రేటర్ ప్రవేట్ హాస్టల్ అసోసియేషన్ ఎలక్షన్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ప్రకటించారు. ఈ ఎన్నికలు సజావుగా జరేగటట్లు ఎన్నికల స్టీరింగ్ కమిటీ సభ్యులు రామ్ ప్రసాద్, బోయిన చంద్ర మౌళి, పచ్చిక సురేందర్ రెడ్డి, యాస బట్టు మధుసూదన్ రాజు, కూడికల భాస్కర్, కీర్తి చంద్రమౌళి, గజేవెల్లి మనోహర్, మానుపాటి పరుశరామ్ నిర్వహించారు.

Related posts

28న ఉచిత ధ్యాన శిక్షణ

వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా

మాధవరెడ్డికి ఉత్తమ సేవ ప్రతిభా అవార్డు