Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఎన్ఎస్ఎస్ అవతరణ దినోత్సవం – షీ టీం అవగాహన సదస్సు*

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 23 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ లోని సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ఎన్ఎస్ఎస్ అవతరణ దినోత్సవ సందర్భంగా పలు రకాల సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా షిటీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నేరాలు అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాలు అదుపులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని షీ టీం సీఐ సుజాత అన్నారు. సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ 500కి పైగా విద్యార్థులను సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈవ్ టిజింగ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు వివరాలు పంచుకోవడం జాగ్రత్త వహించాలని సైబర్ నేరాలపై అవగాహన కలిగించారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలకు ఎవరి నుండైనా ఇబ్బందులకు గురైనప్పుడు కుటుంబ సభ్యులతో పంచుకోవాలని లేదా ధైర్యంగా ఈ క్రింది ఫోన్ నెంబర్లకి సమాచారం ఇవ్వాలరూ 8712685257, 8712685142, 8712685270 కి వాటాసాప్ ద్వారా కానీ నేరగా ఫోన్ కానీ పిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచి నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి చర్య తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డి, కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు ఇ సి ఇ బ్రాంచ్ హెడ్ డాక్టర్ కె మహేందర్ శర్మ అనేక సేవ ధృక్పడమైన విషయాలను వివరించి ఎన్ఎస్ఎస్ ద్వార సమాజానికి చేసే సేవ కార్య్రమాలు వివరించారు. ఈ కార్య్రమంలో విద్యార్దులు సామాజిక విషయాల గురించి అవగాహన నాట్య రూపంలో, కళల రూపంలో చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ శశి కుమార్ రెడ్డి, రవికిరణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరియు షీ టీం సిబ్బంది అయినా భాస్కర్ హెడ్ కానిస్టేబుల్ మరియు రామ్ రెడ్డి సువార్త మరియు విద్యార్థుల పాల్గొన్నారు.

Related posts

కాళోజీ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించిన ఎంపీ కావ్య.

Sambasivarao

ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న మైనర్ దొంగ అరెస్ట్

ఉపాధ్యాయ కుటుంబాలను పరామర్శించిన PRTU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి

Jaibharath News