జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 23
హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు నగరంలో ఆక్రమణలకు గురైన చెరువుల కబ్జాదారులకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే విధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. వరంగల్ నగరంలో అన్ని చెరువులపై అభివృద్ధి దిశగా తీర్మానం చేసాం. వరంగల్ అభివృద్ధికి ఏర్పాటుకు పూనుకున్నాం నయీంనగర్ నాల బ్రిడ్జితో ముంపు ప్రాంతవాసుల కష్టాలు తీర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు తీర్మానం. కాళోజీ కళాక్షేత్రంపై గత ప్రభుత్వం చిన్న చూపు చూసింది. ముఖ్యమంత్రి చొరవతో ప్రారంభానికి సిద్ధమైంది. వర్షాకాలంలో ప్రబలుతున్న రోగాలపై ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసాం. విద్యా, వైద్యం, అభివృద్ధి సంక్షేమాలపై రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ముందుకు సాగుతున్నాం. గత పాలకుల విమర్శలు మేము పట్టించుకోం. మా పని మేము చేసుకుంటు పోతున్నాం. లక్షల కోట్లు మింగిన బీఆర్‌ఎస్ పార్టీ అప్పుల కుప్పను కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను సకాలంలో ఇస్తున్నాం. ఎక్కడా తగ్గకుండా ప్రతి చోట సంక్షేమ పథకాలను జనాలకు అందిస్తున్నాం. గతప్రభుత్వంలో గుట్టలు గుట్టలుగా ఉన్న సీఎం హెల్త్ రిలీప్ ఫండ్ మా ప్రభుత్వంలో క్లియర్ చేస్తున్నాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు.