Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

కేటీఆర్ బీఆర్ఎస్ బిసి నేతలతోసమావేశం

జైభారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం  సెప్టెంబర్ 24
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కార్యనిర్వాహక అధ్యక్షులు కే.టీ.రామారావు పార్టీకి చెందిన బీసీ ప్రముఖులతో సమావేశ మయ్యారు పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర.
తమిళనాడులో బీసీల సంక్షేమం, సముద్ధరణకు అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అధ్యయనానికి పార్టీకి చెందిన బీసీ నాయకులు త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు జోగు రామన్న, వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులతో భేటీ అయ్యారు. బీసీ నాయకులతో కేటీఆర్ పలు అంశాలపై లోతుగా చర్చించారు, పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరు గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్, శుభప్రద పటేల్, ఉపేంద్రాచారి, కిశోర్ గౌడ్, నాయకులు చిరుమళ్ల రాకేష్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజారాం యాదవ్, రవీందర్ సింగ్, ఆలకుంట హరి, వొడపల్లి మాధవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

తెగించి దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది… గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు,

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం

ఎమ్మేల్యే పదవికి హరీష్ రావు రాజీనామా లేఖ