Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏచూరి సస్మరణ సభ

జైభారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టెంబర్ 24సీతారాo ఏచూరి ఆశయాలను కొనసాగించాలి. ఆయన మరణం ఈదేశానికి తీరనిలోటుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీఅలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ విభాగం సెమినార్ హాల్లో ఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు స్టాలిన్ అధ్యక్షతన ఏచూరి సంస్మరణ సభను నిర్వహించారు.ఈ సభకు ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల చక్రపాణి, మాజీ ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా నాయకులు యూనివర్సిటీ కాంట్రాక్టు లెక్చరెర్స్ గౌరవ అధ్యక్షులు అంజన్ రావు, కాకతీయ యూనివర్సిటీ లెక్చరర్ డాక్టర్ పుల్ల శ్రీనివాస్ సిఐటియు కేయు కార్యదర్శి మెట్టు రవి, హాజరయ్యారు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక రాజకీయ సంక్షోభం నుండి బయట పడడానికి సోషలిజం ఒక్కటే శాస్త్రీయమైన పద్ధతి అని ఇలాంటి సమయంలో దేశంలోనే పెద్ద ఎత్తున కార్మిక కర్షక రంగానికి నాయకత్వం వహిస్తూ ప్రపంచ కమ్యూనిస్టు దేశాలను సమన్వయం చేస్తున్న సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి మరణం ఈ దేశ ప్రజానీకానికి శ్రామిక వర్గానికి అలాగే అంతర్జాతీయ వాదానికి తీరనిలోటు అని అన్నారు. అనంతరం యూనివర్సిటీ లెక్చరర్ డాక్టర్ పుల్ల శ్రీనివాస్ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఏంతో అపర మేధావని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, సహాయ కార్యదర్శులు జస్వంత్, పరిమళ కాకతీయ యూనివర్సిటీ అద్యక్షులు సాయి కిరణ్ నాయకులు కుమార్ సాయి రాహుల్ కావ్య ప్రవళిక అనూష శిరీష సందీప్ రాజ్ కుమార్ ప్రదీప్ వివిధ విద్యార్ది సంఘాల నాయకులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిఎం టూర్ కొచ్చినట్టే ఉంది. ప్రజల సమస్య లపై స్పందన లేదు: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

Sambasivarao

ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

రైతులతో ముచ్చటించిన ఎస్సై అశోక్

Jaibharath News