April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నయా వరంగల్ నిర్మాణమే కాంగ్రెస్ లక్ష్యం

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 24 స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం.జరిగిందని హన్మకొండ నయింనగర్ బ్రిడ్జి నిర్మాణం పట్ల సభ ధన్యవాదా తీర్మానం హాజరైన సభ్యులు ఆమోదించారు.ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లకు సైతం మాట్లాడే అవకాశం కల్పించిన సభ. ప్రతి అంశం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తాం.ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ ధ్యేయం.ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల శాసన సభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సభ మొదటగా 61వ డివిజన్ కార్పొరేటర్ దివంగత ఎలకంటి రాములు మరణానికి సంతాపం తెలియజేసి, మౌనం పాటించింది. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని రీతిలో సభ మర్యాదలు పాటిస్తూ పార్టీలకు అతితంగా ప్రతి సభ్యుడికి అవకాశం కల్పించడం జరిగింది.స్థానికంగా శాసన సభ్యులుగా మేము చేసిన పనులను చేయబోయే పనులను చేయాల్సిన పనులను సభలో సవివరంగా వివరించడం జరిగింది. మేయర్, మంత్రి, ఎమ్మెల్యేల మందరం వరంగల్ కార్పొరేషన్ కి రావాల్సిన నిధుల కోసం సభ తీర్మాణం తెలిపింది. అందరి సహకారంతో నాయిమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం నిర్ణిత సమయంలో పూర్తి అయింది. ముఖ్యంగా అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్, పారిశుద్ధ్య నిర్వహణ, మంచి నీటి సరఫరా, విద్యుత్ సరఫరా అంశాలపట్ల సభ కూలంకషంగా చర్చిండం జరిగింది. అన్నిశాఖల అధికారులు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలపై స్పందించలేని అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. బడ్జెట్ లేకున్నా కోట్లలో పనులకుశంకుస్థాపనలు చేసి నిధులను అస్తవ్యస్తంగా మార్చిన గత పాలకులు. ప్రథమ పౌరులకు కనీస స్వేచ్ఛ ఇవ్వని దాఖలు కానీ నేడు అన్ని పార్టీల కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం కల్పించడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఎటువంటి తారతమ్యం లేదు. త్వరలో ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుంది. కనీవినీ ఎరుగని రీతిలో మహా నగరానికి నిధులు కేటాయించ బోతున్నారు. దుష్టశక్తులు ఎప్పుడుఅభివృద్ధికి ఆటంకం కల్పించే విధంగా, సభ మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించినప్పటికి లక్ష్యసాధనతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇష్టానుసారంగా కార్పొరేషన్ నడిపించిన గత పోకడలకు స్వస్తి పలికి మంత్రి, మేయర్, ఎమ్మెల్యేలు అందరం నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు

Related posts

డాక్టర్ రాజేశ్వరిచంద్రశేఖర్ ఆర్య కు సన్మానం

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీ లో మొదటి స్థాయ బహుమతి అందుకున్న వీరగోని హరీష్

సంగెం ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారికి తీర్మాణం అందచేసిన ఎంపిటిసిలు..

Jaibharath News