Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రజలకు సేవకుల్లాగా పని చేయాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ప్రజా ప్రతినిధులు.. అధికారులు ప్రజలకు సేవకుల వలె పని చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మకూర్, దామెర మండలాల పంపు ఆపరేటర్లు విద్యుత్ మోటార్ల మరమ్మతు శిక్షణ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇంటింటికి మిషన్ భగీరథ నీరు అందించేందుకు 40 లక్షల కోట్లు ఖర్చు చేసిన కూడా ప్రజలకు అందడం లేదన్నారు. ఒక్క ఆత్మకూరులోనే త్రాగునీరు అందించేందుకు నెలకు ₹1,70,000 కరెంటు బిల్లు వస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించిన తర్వాత కరెంటు బిల్లులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. వెంటనే అధికారులు పరకాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను దిశల వారిగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు. అందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి సేవ చేయాలని సూచించారు. ప్రజలు కట్టే పన్నులు టాక్స్ ల ద్వారానే వచ్చే ప్రభుత్వ ఆదాయం నుంచే మనం నెలనెలా జీతాలు తీసుకుంటున్నామన్నారు. పంపు ఆపరేటర్ల నిర్లక్ష్యం వల్లనే కొత్తగా కొనుగోలు చేసిన కరెంటు మోటార్లు సంవత్సర కాలంలో మూడు సార్లు ఎట్లా కాలిపోతాయని ప్రశ్నించారు. మా ఇంటిలో మోటారు 12 సంవత్సరాలైనా కూడా ఎలాంటి మరమ్మతులు చేయలేదన్నారు.పంపు ఆపరేటర్లు ఐదు రోజుల పాటు శిక్షణ తీసుకొని విద్యుత్ మోటార్లు కాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా అభివృద్ధి కోసం ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వం నియోజకవర్గాన్ని 10 కోట్లు కేటాయిస్తే తాగునీటి సమస్య పరిష్కరించడం కోసమే రెండు కోట్ల 83 లక్షలు ఖర్చు చేశానన్నారు.గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు పథకాలతో పాటు ఆరు గ్యారెంటీ ల పైన దృష్టి సారించిందన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడం కోసమే వచ్చిన ఆదాయం అంతా పోతుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గం లో ఏ ఒక్క గ్రామానికి కూడా మిషన్ భగీరథ నీరు అందడం లేదన్నారు. అధికారులందరూ ప్రతి మండలంలో ఐదు గ్రామాలను ఎంపిక చేసుకుని 100% మిషన్ భగీరథ నీరు అందించి తీరాలన్నారు.అప్పుడే కరెంటు బిల్లు మిగులుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బీరం సుధాకర్ రెడ్డి పెద్దాపురం సొసైటి వైస్ చైర్మన్ రాజస్వామి, రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు, మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి కక్కర్ల రాధిక రాజు గౌడ్,చైర్మన్ రవీందర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Related posts

కటాక్షపురం చెరువు లో ఘనంగా గణనాధుల నిమజ్జనం

రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్…

తిరుమలగిరి లో మహన్నదానం

Jaibharath News