Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రశస్త్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం

(జై భారత్ వాయిస్ వరంగల్):
విద్యార్థుల నడవడిక , విద్యార్థుల లోపాలు , ఆరోగ్య సమస్యలు గుర్తించి ప్రశస్త్ యాప్ లో నమోదు చేయడం ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించడం సులభం అవుతుందని ఖానాపూర్ విద్యా మండల నోడల్ అధికారి (ఎంఎన్ ఓ) చరణ్ సింగ్ అన్నారు. మంగళవారం మోడల్ స్కూల్ ( టీజీఎంఎస్) బుధరావుపేట పాఠశాలలో హెడ్మాస్టర్లు సైన్స్ ఉపాధ్యాయులతో నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వం తరగతి గదిలోని విద్యార్థుల మానసిక ,శారీరక లోపాలను గుర్తించడం కోసం ఎన్ సి ఈ ఆర్ టి ద్వారా యాప్ ను రూపొందించి, సమాచారాన్ని యాప్ లో నమోదు చేసేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు నివ్వడం శుభపరిణామం అని ఆయన అన్నారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ (ఐఈ ఆర్ పి) మహేందర్ ఈ కార్యక్రమానికి ఆర్ పి గా వ్యవహరించి విద్యార్థులను గుర్తించే విధానం , యాప్ లో వారి వివరాలు నమోదు చేసే విధానాన్ని సమగ్రంగా ఉపాద్యాయులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ రవి కుమార్, ఆర్గనైజర్ శ్రీధర్ లతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆరిఫ్ హుస్సేన్, విజయ, గెజిటేడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు ఫాల్గొన్నారు.

Related posts

కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి

రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్

Sambasivarao

ముంపుకు గురైన కుటుంబాలకు బ్లాంకెట్స్ పంపిణీ*

Sambasivarao