*అబ్బిడి లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు*
వరంగల్ జిల్లా//వర్దన్నపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 వర్ధన్నపేట ప్రతినిధి:-
వర్ధన్నపేట మండల పరిధిలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి తండ్రి అబ్బిడి లక్ష్మారెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నమ్మిండ్ల శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు రాష్ట్ర, జిల్లా, వర్ధన్నపేట మండల, పట్టణ, గ్రామ, స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.