*గీసుకొండలో గ్రామపంచాయతీలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవాలు*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 వరంగల్ ప్రతినిధి:-
తెలంగాణ తల్లీ వీరనారి చాకలి ఐలమ్మ ఉద్యమం స్పూర్తితో బీసీ రాజ్యాధికారం సాదిద్దాం చాపర్తి కుమార్ గాడ్గే పిలుపు నిచ్చారు. గీసుకొండ గ్రామపంచాయతీలో తెలంగాణ తల్లీ వీరనారి చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ స్మరిస్తూ వారి యొక్క జీవిత చరిత్ర అందరూ గుర్తు తెచ్చుకున్నారు. చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం అలుపెరగని పోరాటానికి నాంది పలికిన వీర వనిత. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన వీరనారి చిట్యాల ఐలమ్మ. గత 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారింగా నిర్వహిస్తుంది. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి బీసీరాజ్యాధికారం సాదించడమె నా జీవిత లక్ష్యం అని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్ చాపర్తి కుమార్ గాడ్గే ఆశభావం వ్యక్తం చేస్తూ కామారెడ్డ బీసీ డిక్లరేషన్ 42 శాతం సాధించడం కోసం 17 రోజులు ఆమరణ నిరాహారదీక్షలు చేశాను గత మార్చి నెలలో నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర తొమ్మిది జిల్లాలలో మనమెంతొ మనకంత వాటా చట్టసభల్లో బీసీ రాజ్యం సాదించాలని నిరంతరమూ బీసీ ప్రజల్నీ చైతన్యం పరుస్తు త్వరలో జరగబోయే స్టానిక సంస్థల ఎన్నికల్లో మన ఓటు మనకే వేసుకొని బీసీ రాజ్యం సాదించడమె తెలంగాణ తల్లీ చాకలి ఐలమ్మకి ఘనమైన నివాళులు అని మహానియులు మహాత్మా జ్యోతీరావ్ పులే సావిత్రిభాయి, స్వచ్ భారత్ పితామహులు సంత్ గాడ్గే బాబా, సర్దార్ సర్వాయి పాపన్న, రాజ్యాంగ నిర్మాత డా,, భీమారావు అంబేడ్కర్, పండుగల సాయన్న, మరోజు వీరన్న, బెల్లీ లలితక్క, తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్, శ్రీకాంత్ చారి మహనీయులు అందించిన ఆశయ సాదన వైపు బీసీ ప్రజలు చైతన్యం కావాలని కుమార్ గాడ్గే పిలుపునిచారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కరోబార్ అలీ, సిబ్బంది మరియు రజకసంఘంకుల పెద్దమనిషి చాపర్తి శ్రీనివాసు, సింగారపు రాజకుమార్, చాపర్తి సుధాకర్, రాజమౌళి, వరుణ్ మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.