జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 28
వరంగల్ జిల్లా ఎంజీఎం సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చిలుక మురళిని వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో యూనియన్ నేతలుశాలువా బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రి లో అందరి సహకారంతో పేదలకు వైద్య సదుపాయాలు అందించడంలో సహకరిస్తామని అదేవిధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా సూపరిండెంట్ చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఉద్యోగులు, డాక్టర్లు ,పారామెడికల్ సిబ్బంది, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ అందరి సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాదె వేణుగోపాల్ ,కోశాధికారి పాలకుర్తి సదానందం ,జిల్లా బాధ్యులు గద్దల రాజు ,శంకేసి రాజేష్ ,యూసఫ్, గణేష్ ఎంజీఎం యూనిట్ బాధ్యులు యాదగిరి ,నాగేశ్వరరావు ,కిషన్, రమేష్,గోపి ,వినోద్, శివన్నారాయణ సంఘ జిల్లానేతలు పాల్గొన్నారు.