*జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారిచే హెల్త్ చెకప్ ప్రోగ్రాం*
వరంగల్ జిల్లా//నర్సంపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 నర్సంపేట ప్రతినిధి:-
నర్సంపేట జయముఖి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) మరియు వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ వారు హెల్త్ చెకప్ ప్రోగ్రాంని కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకములైన పరీక్షలు నిర్వహించారు పరిక్షల్లో భాగంగా. జి ఆర్ బి ఎస్, బి ఎమ్ ఐ, ఈసీజీ, బిపి, పల్స్ రేట్ వంటి మొదలగు పరీక్షలు నిర్వహించి వారికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు చెబుతూ వివరిస్తూ ఆహారం లోని మార్పులు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరీక్షలు నిర్వహించామని మెడి కవర్ డాక్టర్ నిహారిక తెలియ జేశారు. కళాశాలయాజమాన్యం చంద్రశేఖర్ రెడ్డి తెలిపినారు. సుమారు 150 మంది అధ్యాపకులు, 300 మంది విద్యార్థులకు టెస్ట్ జరిగాయని తెలిపారు. హెల్త్ చెకప్ కి విద్యార్థులు, కళాశాల సిబ్బంది అందరూ విరివిగా వచ్చి వారి యొక్క ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం చంద్రశేఖర్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాస్ రావు డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ హమీద్ పాషా,వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ వరుణ్, డాక్టర్ రామకృష్ణ రెడ్డి, డాక్టర్ పుణ్ణంచందర్ డాక్టర్ జవహార్, డాక్టర్ విష్ణు, డాక్టర్ ఎస్ వాసుదేవ మూర్తి, డాక్టర్ జి అనిల్ కుమార్, మెడికవేర్ హాస్పిటల్స్ నర్సింగ్ స్టాఫ్ మాధురి, నీల వేణి, సందీప్, కళాశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.