*ఇటీవల మరణించిన చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం*
వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం//పాపయ్యపేట గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 నర్సంపేట ప్రతినిధి:-
ఇటీవల అనారోగ్యంతో తీవ్ర కడుపు నొప్పి భరించలేక ఉరి వేసుకుని మరణించిన బీసీ కాలనీకి చెందిన చిన్ననాటి మిత్రుడు చిరుత అనిల్. అనిల్ కుటుంబానికి తమవంతు సహాయంగా బీసీ కాలనీ యువకులు మిత్రులు ఉప్పరి వెంకటేశ్వర్లు, అన్నెబోయిన అనిల్, కొత్తపెల్లి క్రిష్ణ, అన్నెబోయిన సునీల్, సయ్యద్ పాషా, గడ్డం రాజు, కొత్తపెల్లీ రాజు, ఉప్పరీ అఖిల్, గంప రాజు, గంప కిరణ్, అలేటి వెంకటేశ్వర్లు, పెండ్యాల పూర్ణ, మొర్రి సంతోష్, షేక్ ఖాజా పాషా, షేక్ ఆంజాత్ పాషా, డ్యాగలఅశోక్, అంగీ రవి, కల వెంకటేశ్వర్లు, తదితరులు కలిసి మృతుని కుటుంబానికి 8000/- రూపాయిల ఆర్థిక సాయం అందించడం జరిగినది.