*ఇంటింటి జ్వరం సర్వే అందరూ సద్వినియోగం చేసుకోవాలి*
హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 హనుమకొండ ప్రతినిధి:-
మహానగరంలోని అన్ని మురికివాడలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం. సీజనల్ వ్యాధుల నిర్మూలనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. హనుమకొండ పట్టణంలోని 52 వ డివిజన్ రామ్ నగర్, బంజారా కాలనీలో హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వాహితున్న ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వ్యాధిబారిన పడకుండా చూడటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న 8 అర్బన్ పీ ఎచ్ సిలలో మొత్తం 178 వైద్య శిబిరాలు జరుపుతున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వార్డులలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న క్రమంలో అసంఖ్యాక దోమల వలన డెంగ్యూ బారినపడిన 69 మందిని ప్రత్యేక చికిత్స అందించడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వం ఈ క్యాంప్ లను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చాడ స్వాతి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు తడుక సుమన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు లావూద్య బాలు నాయక్, సుగుణకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మోహన్ నాయక్, బాను నాయక్, తిరుపతి నాయక్, రమేష్ నాయక్ మరియు వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.