జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 వరంగల్
గీసుగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం గీసుగొండ మండల పరిధిలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి శిక్షణలో పాల్గొన్న గ్రామీణ మంచినీటి సహాయకులను పేరు పేరున హాజరు తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న గ్రామీణ మంచినీటి సహాయకుల స్థానంలోమరొకరు నియమించే అధికారం మీకు ఎవరిచ్చారనిమీరు పేర్లు ఎలా మారుస్తారని సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో రక్షిత మంచినీరు అందించాలని మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారని రా వాటర్ తో కలిపి మంచినీరు అందించడంతో నీరుకలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతు తున్నారని అన్నారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన మంచి నీరు అందించాలనే లక్ష్యంతో తాను మిషన్ భగీరథ నీరును ఒక సమయంలో రా వాటర్ ను మరో సమయంలో వదిలి ప్రజలకు అందించాలని అధికారులకు గత ఐదు నెలల క్రితమే ఆదేశాలు ఇచ్చామని అలా చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో 15 రోజులలోగా గ్రామాలలో మిషన్ భగీరథ నీరు నీరును వేరు వేరు సమయాలలో పంపిణీ చేసి ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలని లేనట్లయితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.

previous post