జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 వరంగల్
అక్టోబర్ 3 తేదీ నుండి 12 వ తేది వరకు జరిగే ఓరుగల్లు శ్రీ భద్రకాళీ మాత శరన్నవరాత్రి మహోత్సవముల సందర్బంగా వేలాదిమంది భక్తులు వీక్షించే అమ్మవారి హంసవాహన సేవ తెప్పోత్సవ కార్యక్రమ శాశ్వత దాత అయినా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించి అమ్మవారి సేవలో పాల్గొనాలని భద్రకాళి దేవస్థానం వేద పండితులు అరవింద్ శర్మ. దత్తు శర్మ. ఆహ్వానించారు అనంతరం అమ్మవారి వేద ఆశీర్వచనంతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అమ్మవారి హంస వాహనాన్ని రకరకాల విద్యుత్ కాంతులతో వివిధ రకాల పుష్పములచే సర్వాంగ సుందరంగా అలంకరించి తెప్పోత్సవ సేవా కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులమందరం పాల్గొని అమ్మవారి సేవలో పాత్రుల మౌవుతామని వేదపండితులకు చెప్పడం జరిగింది. శ్రీ శృంగేరి శంకర మఠం వారి ఆహ్వానం.ఆటోనగర్ రోడ్ శ్రీనివాస కాలనీ, శ్రీ శృంగేరి శంకర మఠం శ్రీ శారద దేవి శరన్నవరాత్రి ఉత్సవముల సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించిన ప్రధానార్చకులు సంగమేశ్వర జోషి, అనంతరం అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
previous post