Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 హనుమకొండ
ఎస్ ఎస్ యు విద్యార్థి పోరు యాత్ర ముగింపు విజయోత్సవ సభ. సొమవారం జరిగింది.స్వేరో స్టూడెంట్స్ యూనియన్  హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్లో పరిరక్షణకై విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ ఎస్ యు విద్యార్థి పోరుయాత్రను గత పది రోజుల నుంచి కొనసాగిస్తూ వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ  మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ ను పది రోజులపాటు తిరుగుతూ విద్యార్థులను కలుస్తూ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని
హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ తెలిపారుసంక్షేమ హాస్టల్లో కు కాస్మొటిక్ చార్జెస్ పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనము అందించాలని  అదే విధంగా చలికాలంలో విద్యార్థులకు బెడ్ షీట్స్, మ్యాట్రెస్  సొంత భవనం కూడా నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారువిద్యార్థులు మా దృష్టికి తీసుకువచ్చిన అనేకమైన సమస్యలను ఉన్నత అధికారులను కలిసి పరిష్కారమయ్యేంతవరకు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులకు అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి  స్వేరోస్ రాష్ట్ర ఈసీ మెంబర్ మారపల్లి మనోజ్, స్వేరోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు శనిగారపు రాజేంద్రప్రసాద్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జనగామ జిల్లా అధ్యక్షులు మాదారపు విజయ్ కుమార్, చెట్టుపల్లి శివకుమార్ మరియు సిద్దు ముగింపు సభకు హాజరు కావడం జరిగింది.

Related posts

చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి పరకాల కోర్టు జడ్జి శాలిని లింగం

Sambasivarao

గోకుల్ నగర్ లో బతుకమ్మ వేడుకలు

Jaibharath News

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News