జైభారత్ వాయిస్ న్యూస్ అక్టోబర్ 01 హనుమకొండ-తెలంగాణ ఆడపడుచుల విశిష్ట పండుగైన బతుకమ్మ ఉత్సవాలు గురుకుల్ ది స్కూల్ లో నిర్వహించినారు విద్యార్ధినీలు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి సుందరంగా అలంకరించి పాఠశాల ఆవరణంలో బతుకమ్మ ఆటను చప్పట్లతో సంప్రదాయ ఉయ్యాల పాటలు ఆలపిస్తూ విద్యార్థులు బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సాహల మద్య ప్రారంబించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ లు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను దాని నేపద్యాన్ని వివిధ రకాల పూలను వాటి వినియోగం వెనుక ఉన్న విశిష్టతను ఆరోగ్య విషయాలను వివరించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు ఉపాద్వాయినీ ఉపాద్యాయులు పాల్గొన్నారు. పిల్లల ఆటపాటలతో కోలాటాలతో ప్రాంగ అంతా కళకళలాడి పోయింది. బతుకమ్మ పండగ గురించి చిన్నారులందరికీ అర్థమయ్యేలా ఉపాధ్యాయులు చెప్పారు. దసరా నవదుర్గా రూపాలను కూడా చిన్నారులు ప్రదర్శించారు.

next post