జై భారత్ వాయిస్ న్యూస్ దామెర అక్టొబర్ 02
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని దామెర ఎస్సై అశొక్ తెలిపారు.డీజేల నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ప్రజలు, ముఖ్యం గా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణం తో ఇకపై వరంగల్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డి. జే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీసు కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందన్నారు

previous post