April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టొబర్ 02
మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా టీఎన్జీఓ స్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ అహింస యుతముగా మహాత్మా గాంధీ సాధించిన స్వాతంత్రోద్యమ ఫలితాల ద్వారానే మనమందరం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని కొనియాడారు .అదేవిధంగా అందరూ మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని తన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాదె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, కేంద్ర సంఘ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు ,సహాధ్యక్షులు హేమ నాయక్, జిల్లా బాధ్యులు సత్యనారాయణ, చిరంజీవి ,సందీప్, నాగేశ్వరరావు, భాను ప్రకాష్ తదితర జిల్లా సంఘ నాయకులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్‌ మోసాలను ఎండగట్టాలి ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి..మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

Jaibharath News

అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి*

Jaibharath News