(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని హౌస్ బుజ్జూర్ గ్రామంలో ఏర్పాటైన సెంట్రల్ లైటింగ్ సిస్టన్ని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. కటాక్ష పూర్ చెరువు నుండి ప్రగతి సింగారం వరకు రవాణా సౌకర్యం మెరుగుపడిందన్నారు.
మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక
బతుకమ్మ పండగ
మహిళల ఆత్మగౌరవానికి ప్రతికగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండల కేంద్రంలో ని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కాసేపు ముచ్చటించి బతుకమ్మ ఉత్సవాలకు భారీగా ఏర్పాటు చేయాలని అక్కడున్న అధికారులను ఆయనఆదేశించారు. ఏడాది బతుకమ్మ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చెరువుల వద్ద రోడ్డు సౌకర్యం లైటింగ్ సిస్టం, అణువుగా ఆటస్థలా లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.