Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఒక కుటుంబం ఒక కార్డు లక్ష్యంగా డిజిటల్ కార్డులు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3
    ఒక కుటుంబం ఒక కార్డు లక్ష్యం గా డిజిటల్ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి  కొండా సురేఖ తెలిపారు.గురువారం వరంగల్ నగర పరిధి 12 వ డివిజన్ దేశాయిపేట లో మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యం లో రాష్ట్ర ప్రభుత్వం  పైలెట్ ప్రాజెక్ట్ గా చేపడుతున్న డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే ను మంత్రి అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బల్డియా కమీషనర్  అశ్విని తానాజీ వాకడే అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని  ప్రసంగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ఇచ్చిన హామీల మేరకు  ఆరు గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం  ముందుకు వెళుతుందని అందులో భాగంగా 200 వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ తో పాటు  500 లకే గ్యాస్ సిలిండర్లను  అందజేయడం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుండి 10 లక్షల పెంచడం  రైతులకు రుణమాఫీ చేయడం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించే క్రమంలో రేషన్ కార్డుల కోసం ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించడం జరిగిందని  అన్నారు.    రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఫ్యామిలీ యూనిట్ గా  కార్డు అందజేయాలని సంకల్పించి  సంబంధిత కుటుంబం యొక్క డేటా అంత ఆ కార్డులో నిక్షిప్తమై ఉండేలా,  దేశస్థాయిలో ఆధార్ కార్డుకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో  అదే స్థాయిలో ఫ్యామిలీ కార్డు  పనిచేసేలా  ఎక్కడి నుండైనా ఈ కార్డు పనిచేసేలా రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్డును గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా సర్వే ప్రారంభించడం  జరిగిందని అందుకుగాను వరంగల్ లో రెండు డివిజన్లను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని దేశాయిపేటలో ప్రారంభించుకోవడం జరిగిందని, మరణించిన వారి పేర్లను తొలగించడం, కొత్తగా కుటుంబంలో చేరిన వారి పేర్లను నమోదు చేయడం, ఉమ్మడి కుటుంబంలో వివాహాలు జరిగిన వారికి కుటుంబాల వారిగా కార్డులను అందజేయడం జరుగుతుందని, ప్రస్తుతం అందజేసే  డిజిటల్ కార్డులో  మహిళలను   కుటుంబ యజమానిగా పేర్కోనడం  జరుగుతుందని, గత  ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సూచించినట్లుగా మహిళలకు భరోసా అందించడానికి వారిని యజమానులుగా పేర్కొనడం జరుగుతుందని, అదే పంథా ను ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు.ప్రభుత్వ ఆదేశం మేరకు ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్ లో భాగం గా సర్వే చేపట్టడానికి జిల్లా కలెక్టర్ ఉద్యోగులు సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి  సర్వే నిర్వహింప చేస్తారని ఇందులో ఏమైనా లోపాలు ఉంటే గుర్తించి సరిచేయడానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద  తీసుకోవడం జరిగిందని, పైలెట్ ప్రాజెక్ట్ సర్వే నిర్వహణకు డివిజన్ నుండి డేటా పంపించిన క్రమం లో 150 గృహాలను సర్వే చేయడానికి ప్రభుత్వం నుండి ఆమోదం లభించిందని పైలెట్ ప్రాజెక్ట్ అనంతరం అన్ని గృహాల్లో సర్వే నిర్వహించి డిజిటల్ ఫ్యామిలీ కార్డులు అందజేస్తామని  డిజిటల్ కార్డులు ఇప్పిస్తామని, ప్రజల వద్దకు వచ్చే మధ్య దళారులను నమ్మవద్దని,  సర్వే నిర్వహణ కార్డుల అందజేత నిష్పక్షపాతంగా పారదర్శకం గా జరుగుతుందని  ఇట్టి అద్భుతమైన ప్రాజెక్టుకు రూపు కల్పన చేసిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని, వాటికి  నిరుపేదలకు అందేలా చూస్తామని, డబుల్ బెడ్ రూమ్ లకు మరమత్తులు చేసి నిరుపేదలకు అందజేస్తామని, తప్పుడు హామీలు ఇచ్చే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమమే ఎజెండా గా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పునరుద్ఘాటించారునగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ*  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  డిజిటల్ ఫ్యామిలీ కార్డులను అందజేయడాన్ని. ప్రతిష్టాత్మకంగా తీసుకొని  రాష్ట్ర వ్యాప్తంగా  ప్రారంభించడం  సంతోషదాయకమని  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను  అమలు చేస్తూ ఆరు గ్యారంటీల్లో భాగంగా   రూ. 500 కే సిలిండర్ ను అందజేయడం జరుగుతుందని  వ్యక్తిగత ఆధార్ కార్డు  మాదిరిగా కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డు అందజేయడం  అందులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయడం తో పాటు అవసరార్డులు వ్యక్తిగత కార్డు లు కూడా పొందవచ్చని వరంగల్ (తూర్పు)నియోజక వర్గం లో 12, 38 డివిజన్ లను పైలెట్ గా ఎంపిక చేసి సర్వ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.జిల్లా కలెక్టర్  సత్య శారద మాట్లాడుతూ దారిద్య్ర రేఖ కు దిగువ (బిపిఎల్) దారిద్య్ర రేఖ కు ఎగువ (ఏపిఎల్) తో సంబంధం లేకుండా  ఒక కుటుంబానికి ఒక గుర్తింపు కార్డు అందజేయడానికి  పైలట్ గా 12వ డివిజన్ ను ఎంచుకోవడం జరిగిందని ఈనెల 3 నుండి 7 వరకు సర్వే కొనసాగుతుందని, ఇక్కడ సుమారుగా 3  వేల కుటుంబాలు ఉన్నాయని అందులో నుండి 150 ఎంపిక చేసి  సర్వే నిర్వహించడం జరుగుతుందని , ఇందులో  మరణించిన వారు ఉంటే వారి సమాచారాన్ని తొలగించడం  కొత్తగా ఎవరైనా చేరితే సమాచారాన్ని నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.అనంతరం  ఇంటింటి సర్వేలో పాల్గొని మంత్రి  కొండ సురేఖ, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ,  డిజిటల్ కార్డు పై నగర ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి, డిప్యూటీ కమిషనర్ కృష్ణా రెడ్డి, కార్పొరేటర్లు కావేటి కవిత, బస్వరాజు కుమారస్వామి, సురేష్ జోషి, ఫుర్ఖాన్  టి పి ఆర్ ఓ కోలా రాజేష్ కుమార్ తహశీల్దార్ ఇక్బాల్ టి ఎం సి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంగన్వాడీలో చిన్న పిల్లలను చేర్పించాలి

Sambasivarao

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

Sambasivarao

ఇల్లంద లో తెలంగాణ విమోచన దినోత్సవం

Sambasivarao