Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యం:


జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3
మత్స్యకార కుటుంబాలలో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యమని  రాష్ట్ర అటవీ,పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన 100% పై రాయితీతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్నిజిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా తో కలసి మంత్రి  లాంఛనంగా ప్రారంభించి వరంగల్ పట్టణంలోని ఉర్సు రంగ సముద్రంలో చెరువులో చేపలను వదిలారు.ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ ఒక వరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వెలుగు నింపేందుకు ప్రణాళికల రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో చేప పిల్లల పంపిణీ  చేపడుతున్నట్లు తెలిపారు. చేప పిల్లల పంపిణీ గ్రామాల్లో  పండగ వాతావరణం లో జరగాలని సూచించారు.  ఈ ఏడాది భారీ వర్షాలకు చెరువులు నీటి వనరులన్నీ జలకల సంతరించుకున్నందున  మత్స్యకారుల కుటుంబాలు సిరులు కురవాలని  ఆకాంక్షించారు.చేపలను పంపిణీ చేయడమే కాకుండా ఆ చేపలను పట్టుకునేందుకు మత్స్యకారులకు వలలు తెప్పలు, ఇవ్వడంతోపాటు చేపలను నిల్వ చేసుకునేందుకు ఐస్ బాక్సులు వాటిని విక్రయించేందుకు ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలు  సైతం రాయితీపై మంజూరు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని తెలిపారు.రాష్ట్రం ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా మత్స్య సంపదపై దృష్టి సారించగా, కేంద్ర ప్రభుత్వం కూడా మత్స్య సంపద పెంపొందించేందుకు పలు ప్రోత్సాహకాలు అందజేస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద పలు రకాలుగా మత్స్య సంపద పెంపొందించేందుకు ఎస్సీ ఎస్టీ, జనరల్, సామాజిక వర్గాలకు రాయితీపై ప్రోత్సాహకాలను అందజేస్తుందని, ఆయా పథకాలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు.  రంగసముద్రంలో ఉన్న గుర్రపు డెక్క,  పిచ్చి చెట్లను  తొలగించి చెరువును శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ 2024- 25 సంవత్సరానికి జిల్లాలోని 707 చెరువులు మరి ఒక రిజర్వాయర్లలో 194.127 లక్షల చేప పిల్లలు 100% సబ్సిడీపై పంపిణీ చేయుటకు ప్రణాళిక సిద్ధం చేసి నెల రోజుల్లోగా 100% పంపిణీ చేయుటకు అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గురువారం వరంగల్ పట్టణంలోని రంగసముద్రం చెరువులో 50 హెక్టార్ల నీటి విస్తీర్ణం కలిగి ఉన్న చెరువులో   ఉచితంగా సరఫరా చేయడంలో భాగంగా నిబంధనల మేరకు 50 శాతం చేప పిల్లలను పంపిణీ చేశామని, అందులో 10 వేలు బొచ్చే రకం ,12500 రోహురకం, 2500 మెరిగే రకం మొత్తం 25 వేల చేప పిల్లలను చెరువులో వదలడం జరిగిందన్నారు.  ఉర్సు మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 79 మంది సభ్యులు ఉన్నారని గత సంవత్సరం 40 టన్నుల చేపల దిగుబడి రాగా సంఘానికి 20 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. అదేవిధంగా 100% సబ్సిడీపై నాలుగు చెరువులలో 12.14 లక్షల రొయ్య పిల్లలను  పంపిణీ చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మరుపల్ల రవి, చింతాకుల అనిల్, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగమణి, సంబంధిత అధికారులు మత్స్య సంఘాల సభ్యులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నా

Related posts

బతుకమ్మ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలో భూమి కోల్పోయిన రైతులు ఎక్కువ పరిహారం కావాలని కలెక్టరరును కలవడం జరిగింది

Sambasivarao