జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించారు. అనంతరం మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఆలయ అర్చకులు భాగవతుల మోహన్ శర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లవాడ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, భవాణి మాత స్వాములు తదితరులు పాల్గొన్నారు.