జైభారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూర్ అక్టోబర్ 3
పిడుగుపడి చనిపోయిన కౌలు రైతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి 10 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా, మరియు ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారుఆత్మకూరు మండలం చౌళ్ళపెల్లి గ్రామంలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ఇద్దరు మహిళ రైతులుచేను దగ్గర నుండి ఇంటికి వస్తున్న సమయంలో పిడుగు పాటు పడి మరణించడం జరిగింది. ఇటికాల నిర్మల,సోలంకి రామ వీరిద్దరూ చేను వద్ద నుండి ఇంటికి వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పిడుగు పాటు పడి మరణం చెందడం జరిగింది. . ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అద్యక్షులు వరికల కిషన్ రావు, ఆరే యువసేన వరంగల్ జిల్లా అధ్యక్షులు కుసుంబ రఘుపతి తదితరులు అంతక్రియలో పాల్గొని ఈ కుటుంబాలను ఓదార్చడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, సోలంకి రవి, మోరే రాజు, మోరే రాజేశ్వరరావు, మరిగిద్ద రాజేశ్వరరావు, ఇంకా తదితరులు పాల్గొన్నారు.
previous post