జైభారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట అక్టోబర్ 3
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తుందని వర్ధన్నపేట మండల యువజన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కుల్ల యాకాంతం తెలిపారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైడ్రా పనితీరుపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం కోల్పోయాక మరో విధంగా మాట్లాడటం బిఆర్ఎస్ పార్టీకి తగదన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉండగా హైదరాబాదులోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పలు సందర్భంలో మాట్లాడారని గుర్తు చేశారు తీరా అధికారం కోల్పోయాక కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటే ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని కుల్ల యాకాంతం హెచ్చరించారు అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడిన కెసిఆర్ సర్కారును ప్రజలు గద్దె దించిన బుద్ధి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటే తప్పేంది అని ప్రశ్నించారు.