Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మత్స్యకారుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

+జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 04)సహకార సంఘాలు ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక భూమిక. భీమా పథకం ద్వారా సహకార సంఘాల సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా 2024 25 సంవత్సరం గాను జిల్లాలో 2.31 కోట్ల చేప పిల్లల్ని పంపిణీకి సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా చేపపిల్లల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలానే ఉద్దేశ్యంతో చేప పిల్లలను ఉచితంగా పంపిణి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున కాజిపేట ఫాతిమానగర్ వడ్డేపల్లి పెద్ద చెరువులో జిల్లా మత్స్యకారులశాఖ అధికారులతో కలిసి చేప పిల్లలను పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2024-25 సంవత్సరము గాను 13.19లక్షల చేప పిల్లలను 100% సబ్సిడీ పై సరఫరా చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో 5మత్స్యకార సహకార సంఘాల సొసైటీలు ఉన్నాయని, ఈ రోజు వడ్డేపల్లి పరిధిలోని 4 చెరువులలో 4.38లక్షల చేప పిల్లలను పంపిణి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతియేట అక్టోబర్ మాసంలో చేపపిల్లను పంపిణి చేయడం జరుగుతుందని గతంలో మహానగరంలో సుమారు 700 ల చెరువులలో పంపిణి చేసే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత , ముఖ్యమమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 811 చెరువులలో పంపిణికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పటికే ఆక్రమిత చెరువులు, కుంటలపై హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణ జరుగుతున్న విషయం గుర్తు చేశారు. రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ లో కూడా రెవిన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులకు కచ్చితమైనా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. చెరువులు అనగానే కాకతీయుల నాటి ఆనవాళ్లకు ప్రతీక అని ప్రజలందరు సహకరిస్తా చెరువులు, కుంటలు తిరిగి పునర్ వైభవం వస్తుందని కోరారు. చేప పిల్లల పెంపకానికి ఉత్సహవంతులకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. మత్స్యకార సొసైటీ సభ్యులు కూడ చెరువుల పరిరక్షణలో తమ వంతు భాద్యత నిర్వార్తించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గజపాక రమేష్, సుధాకర్, పున్నం చందర్, మాజీ కార్పొరేటర్ లు చుంచు అశోక్, నాగరాజు, మత్స్యశాఖ సహకార సంఘాల నాయకులు నర్సింగ్, కోటేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగరిక రమాకాంత్, లక్ష్మణ్, రమేష్, మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ చైర్మన్ దారబోయిన ప్రణయ్ దీప్,వైస్ చైర్మన్ సిరబోయిన్ సతీష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కూర వెంకట్, 60 వ డివిజన్ కాంటెస్టడ్ కార్పో రేటర్ మండల సమ్మయ్య, అడిషన్ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ శంకర్ రాథోడ్, జిల్లా మత్స్యశాఖ సంక్షేమ అధికారి నాగమణి, జిల్లా మత్స్యశాఖ సంఘాల ప్రమోటర్ బుస్స మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదర్శ పాఠశాల పనులు వేగవంతం చేయాలి – పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News

మట్టిలో నవజాత శిశువు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

Jaibharath News

ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటా డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి