ఆత్మకూర్ మార్కెట్ చైర్మన్ గా బీరం సునంద సుధాకర్ రెడ్డి
- సర్పంచి ఎంపీపీ టు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా
- ఎమ్మెల్యే లు రేవూరి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజ్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బీరం సునంద సుధాకర్ రెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం ఆత్మకూరు మండలం గూడప్పాడు గ్రామానికి చెందిన బీరం సునంద సుధాకర్ రెడ్డి రాజకీయ అరకేటం చేసిన మొదటి సంవత్సరమే 2001 నుంచి 2006 వరకు గుడపాడు సర్పంచిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి 2011 వరకు ఉమ్మడి ఆత్మకూరు మండలం ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆత్మకూరు దామెర మండలాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తూ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం తీవ్ర కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన బీరం సునంద సుధాకర్ రెడ్డి సేవలను గుర్తించి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ఆత్మకూరు దామెర హసనపర్తి మూడు మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బీరం సునంద సుధాకర్ రెడ్డికి కీలక పదవిని అందేలా రేవూరి ప్రకాశ్ రెడ్డి చక్రం తిప్పారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సహకారంతో ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని బీరం సునంద సుధాకర్ రెడ్డి తెలిపారు. వారి సహకారానికి ఎప్పటికి రుణపడి ఉంటానని మూడు మండల ప్రజల కు అందుబాటులో ఉండి పార్టీని మరింత బలోపేతం చేస్తూ రైతు సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి కేఆర్ నాగరాజు లకు కృతజ్ఞతలు తెలిపారు.