అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంపరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ హాజరైనారు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బీరం సునంద సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది . గుడెప్పా డ్ మార్కెట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ , కాంగ్రెస్ నాయకుడు బీరం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అధికారులు హాజరయ్యారు. కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దామెర క్రాస్ రోడ్డు నుండి ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ తో ముందుగా ఇద్దరి ఎమ్మెల్యేల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్ పర్సన్ గా బీరం సునంద సుధాకర్ రెడ్డిని ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు పుష్ప గుచ్చాలను అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సునంద సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వనరులను, ప్రభుత్వ భూములను ధరణి సైటును అడ్డుపెట్టుకొని అవక తవకలకు పాల్పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గత ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. పరకాల నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి లేదని విమర్శించారు. పరకాల నియోజకవర్గం ప్రతి కార్యకర్తకు, నాయకులకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు గుర్తింపు పదవులు అంది వస్తాయని ఎవరు అధైర్యపడ వద్దన్నారు. ఆత్మకూరు మార్కెట్ ను వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా తంగెళ్లపల్లి తిరుపతి, కమిటీ డైరెక్టర్లుగా కాడబోయిన రమేష్, పిట్టల రాజేందర్, సానబోయిన రవి, షేక్ నవీర్, దామెర చక్రియ, లక్కిడి సుజాత, ముండ్రాతి బిక్షపతి, పల్లె దయాకర్, గౌరు రాజి రెడ్డి, జాడి రాజీవ్ గాంధీ, పాడి గణపతి రెడ్డి, సిహెచ్ భాను ప్రకాష్ లు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
