జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్15
ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల అద్దె భవనాలకు ప్రభుత్వం అద్ద చెల్లించకపోవడంతో దసరా సెలవుల తర్వాత భవన యజమానులు విద్యార్థులను ఉపాధ్యాయులను లోనికి పంపించని సంఘటన వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు గుట్ట సమీపంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో సంఘటన చోటుచేసుకుంది విరాళాలకు వెళ్తే ఈ విద్యా సంవత్సరము ప్రారంభం నుంచి నేటి వరకు ప్రభుత్వం అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి పాఠశాలలకు ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో యజమానులు అద్దె చెల్లించే వరకు పాఠశాలలోకి అనుమతించేది లేదని పాఠశాల ఆరుబయట బ్యానర్ కట్టి విద్యార్థులను ఉపాధ్యాయులను లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అద్దె చెల్లించాలని పలువురు కోరుతున్నారు