Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అత్మకూరు పాఠశాల ను ఆకస్మికంగాచేసిన కలెక్టర్ ప్రావీణ్య.-పరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : ఆత్మకూరు జిల్లా పరిషత్ పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం తెలియదాని అని ప్రశ్నించారు. పాఠశాలలో నిర్మాణంలో ఉండి మిగిలిపోయిన పనులను త్వరత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించిన కలెక్టర్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలన్నారు. అలాగే మండల విద్యా వనరుల కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలను ఎందుకు ఉంచార ని ఎంఈఓ విజయకుమార్ ని ప్రశ్నించారు. ప్రభుత్వం పాఠశాలల్లో అమ్మఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన తాగునీరు సౌకర్యం టాయిలెట్ల మరమ్మత్తుల పనులను మొదలుపెట్టి పూర్తి చేయాలని సంబంధిత ఎంఈఓ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు

Related posts

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jaibharath News

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి ఎమ్మేల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి