(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
హిమచల్ ప్రదేశ్ లో జరిగే 49వ జాతీయ స్థాయి యోగా పోటీలకు అడుప అభినవ నేతాజీ ఎంపికైనాడని ఉమ్మడి వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఈటి బొలిశెట్టి కమలాకర్ తెలిపారు.సెప్టంబర్ నెలలో హైదారాబాద్ లో సరూర్ నగర్ ఇండొర్ స్టేడియంలో తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు లలో వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన అడుప అభినవ నేతాజీ 16 -18 ఎళ్ళ విభాగంలో పోటీలలో తృతీయ స్థానం సాదించి జాతీయ స్థాయి యోగా పోటీకి ఎంపిక అయ్యారని అన్నారు. అక్టొబర్ 24 నుండి 27 వరకు హిమచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉనా లో యోగా పెడరేషన్ అఫ్ ఇండియా అధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ యోగా పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గోనున్నట్లు కమలాకర్ తెలిపారు.

next post