(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) :: హన్మకొండ జిల్లా
ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య అన్నారు శనివారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోగులకు సరిపడా మందులు ఉన్నాయా అని మెడికల్ ఆఫీసర్ స్పందన ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ఓపి రోగుల సంఖ్య రిజిస్టర్ ని రికార్డులను పరిశీలించారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో పాముకాటు, కుక్క కాటు వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే నీరుకుల్ల, పెద్దాపూర్, అక్కంపేట గ్రామాల్లోని సబ్ సెంటర్ల పని తీరును ఆయన పరిశీలించారు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన, డాక్టర్ పుష్పలీల, డాక్టర్ నాగేశ్వరావు, సి హెచ్ ఓ, స్టాఫ్ నర్స్ హెల్త్ సూపర్వైజర్లు ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బంది పాల్గొన్నారు.

previous post