Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే కుల గణన- పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే  ప్రజా ప్రభుత్వం కుల గణన చేపడుత్తున్నదని పరకాలశాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఆత్మకూరు లోని జి ఎస్ ఆర్ గార్డెన్ లో ఆదివారం ఆత్మకూర్, దామెరమండలాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం  జరిగినది. ఈ సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, గణన సర్వేపై కార్యకర్తలకు వివరించారు.దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో తీసుకోని విధంగా తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి  కులగణన కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నెల 6 నుండి 26 వరకు నిర్వహించే సమగ్ర ఇంటింటి కుటుంబ  సర్వేను విజయవంతం చేయాలని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పేదల, బడుగుల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చిందని అన్నారు.సమగ్ర కుల గణన సర్వేలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి వచ్చిన ఎన్యుమరేటర్ లకు సహకరించాలని అన్నారు.పరకాల నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోవాలని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తన మార్క్ చూపించుకోవాలనే తపన తప్ప నాకు ఏ స్వార్ధము లేదని అన్నారు.
శాసన సభ్యులుగా గెలిచినప్పటి నుండి పరకాల నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నానని అన్నారు.ఎన్నికల ముందు హడావుడిగా నిధులు లేకపోయినా పనులు మంజూరి చేసినట్టు శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేసారని తెలిపారు.సిఆర్ఆర్ క్రింద 30 కోట్ల 20 లక్షల రూపాయలు మరియు ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద 31 కోట్ల 31 లక్షల రూపాయలు,  ఎస్ సి సబ్ ప్లాన్ క్రింద 11 కోట్ల 25 లక్షల రూపాయలు,  ఎస్ టి సబ్ ప్లాన్ క్రింద 6 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనుల మంజూరికి ప్రతిపాదనలు పంపివ్వడం జరిగిందన్నారు.సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటివరకు 932 మంది లబ్దిదారులకు 2 కోట్ల 89 లక్షల 64 వేల 500 రూపాయలు చెక్కులను,కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 952 మంది లబ్దిదారులకు 9 కోట్ల 53 లక్షల 10వేల 432 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశములు కల్పించుటకు వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇప్పించి జాబ్ మేళాను అతి త్వరలో చేపట్టబోవుచున్నామని తెలిపారు.

Related posts

మే 2న రెడ్డి కృతజ్ఞత సభను విజయ వంతం చేయాలి

బిజెపి పార్టీలోకి భారీ చేరికలు

ఒగ్లాపూర్ లో పోచమ్మ బోనాల పండుగ

Jaibharath News