Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

పంచకూట శివాలయ పునః ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం-ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి.

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలోశ్రీ పార్వతి సమేత మహాదేవ స్వామి పంచకూట శివాలయం పున:ప్రతిష్ట కార్యక్రమాలు ఈ నెల 6, 7, 8 తేదీ లలో అత్యంత వైభవోపేతంగా కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నామని పున: ప్రతిష్ట ఆలయ కమిటీ అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి తెలిపారు.సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 7 8 తేదీల్లో పంచలింగ మహాదేవ స్వామి, పార్వతి దేవి, విఘ్నేశ్వర, కుమారస్వామి, నందీశ్వర, నవగ్రహ, నాగ బంధన, బలిపీఠ ధ్వజస్తంభ ప్రతిష్టాలను శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ శా న గుండ కిరణ్ కుమార్ శర్మ పర్యవేక్షణలో వేద పండితులు వైభవంగా విగ్రహాల ప్రాణ ప్రతిష్ట ను నిర్వహిస్తారని తలిపారు . శుక్రవారం చివరి రోజున సాయంత్రం 6:30 గంటలకు శివ కళ్యాణం నిర్వహిస్తామన్నారు.మూడు రోజులపాటు భక్తులకు ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు ,కామారం తిరుమలగిరి గూడెప్పాడు గ్రామాల తో పాటు జిల్లా నలుమూలల నుండి శివ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహా దేవుని సేవించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. దాతల సహకారంతో సుమారు మూడు కోట్ల రూపాయల తో శిథిలావస్థలో ఉన్న దేశంలోనే అరుదైన పంచకూట శివాలయాన్ని 2019 నుంచి పూర్తిగా రాతితో నిర్మాణం చేపట్టి పున: ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆలయ పూజారి పాలకుర్తి రవీంద్ర శర్మ ,పునర్ ప్రతిష్ట కమిటీ ప్రతినిధులు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, రేవూరి తిరుపతిరెడ్డి, తోట రఘు, సిరిపురం సంపత్, నాగ బండి శివప్రసాద్, ఉప్పుల సుదర్శన్ బూర కిషోర్ ,రేవూరి దేవేందర్ రెడ్డి, రేవూరి జలంధర్ రెడ్డి, ఉప్పునూతల శంకర్ , కొంకిస సాంబ రెడ్డి, మండల తిరుపతిరెడ్డి ,భాష బోయిన సాగర్, తోట కుమారస్వామి, ఎర్ర శివారెడ్డి ,సిరిపురం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

_శ్రీ వినాయక పూజ విధానం –  వ్రతకల్పం – వ్రతకథ_*

కాణిపాకంలో నిత్య భజనలు ప్రారంభించాలని వెయ్యికి పైగా కళాకారుల కళా ప్రదర్శన.

samatha kumb సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు