జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి 17 సంవత్సరాల బాల బాలికల యోగా ఆసనముల పోటీలు హన్మకొండ జవహర్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ దస్రు నాయక్, వరంగల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ సారంగపాణి కన్వీనర్ బొలీశెట్టి కమలాకర్, ఫిజికల్ డైరెక్టర్లు కుండే కిరణ్, శ్రీనివాస్, సోమన్న , కిషన్ నాయక్ పాషా ప్రభాకర్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయురాలు కోట రజిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన యోగ క్రీడాకారులు ఈ నెల 6,7,8వ, తేదీలలో వరంగల్ జిల్లాలోని వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ మరియు డ్రగ్గిస్ట్ భవనంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని క్రీడాకారులు అందరూ హాజరు కావాలని కన్వీనర్ బొలిశెట్టి కమలాకర్ దాస్రు నాయక్ తెలిపారు