(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ కోరారు. బుధశారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లో భాగంగా 42వ డివిజన్ 9వ బ్లాక్ మహంకాళి వీధిలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేపట్టారు. సర్వే సందర్భంగా డోర్ స్టికర్లు అతికించారు. డివిజన్ పరిధిలోని రంగశాయిపేట ప్రజలు అందరు ఈ కుల గణన కార్యక్రమములో ఎన్యుమరేటర్లకు కుటుంబ వివరాలను పూర్తిగా అందించి సహకరించాలన్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన పథకాలు పేద ప్రజలకు అందేవిదంగా డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కుల గణన కార్యక్రమం లో పాల్గొని విజయ వంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్ర కుమార్, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.