Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ప్రారంభానికి ముస్తాబైన ఆత్మకూరులోని పంచకూట శివాలయం

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలో అత్యంత భక్తితో నిర్మిస్తున్న శ్రీ పార్వతీ సమేత మహాదేవ పంచకూట ఆలయం ప్రారంభానికి ముస్తాబయింది. నాటి కాకతీయ రాజులు నిర్మించి సేవించిన శ్రీ పార్వతీదేవి మహాదేవ ఆలయం శిధిలావస్థకు చేరుకోగా మండలంలోని అనేకమంది ప్రజలు భక్తులు విరివిగా విరాళాలు ఇవ్వడంతో, ఏర్పాటు చేసుకున్న కమిటీ నూతనంగా శివాలయం నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 5 సంవత్సరాలుగా రాతి కట్టడాలతో నిర్మిస్తున్న శివాలయం లో ఈ నెల 6, 7 ,8 తేదీలలో ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. భారతదేశంలోని రెండవదిగా పేరుగాంచిన పంచ కూట శివాలయం లో పంచలింగాలు ఏర్పాటు చేసి పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, లకు ప్రతిష్ట చేయనున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. దాదాపు రూ. 3 కోట్ల విరాళాలతో నిర్మిస్తున్న ఆలయం ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. భారీ ఏర్పాట్లు చేశారు. అన్నదానం కార్యక్రమాలు తలపెట్టారు. వివిధ ప్రదేశాల నుంచి పురోహితులు ఆలయప్రతిష్ట కు రానున్నారు. మూడు రోజులలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, పోలీసు అధికారులు రానున్నారు. ఆత్మకూరు సందడి వాతావరణం నెల కొన్నది. ఈనెల ఆరవ తేదీన గణపతి ప్రార్ధన గోపూజ యాగశాల ప్రవేశము జరుగుతుందని ఆలయ పూజారి రవీందర్ శర్మ తెలిపారు.శ్రీ పార్వతిదేవి సమేత మహాదేవ స్వామి పంచకూట శివాలయం పునః ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవం, ఈ నెల 6, 7, 8, బుధ, గురు, శుక్ర వారాల్లో జరుగుతుందని కమిటీ చైర్మన్ వంగాల బుచ్చి రెడ్డి తెలిపారు. ప్రతిష్టా కార్యక్రమ వివరములు తెలిపారు. 6 బుధవారం న ఉదయం 8:30 -11:00 గంటల వరకు గణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, మూలమంత్ర జపములు, నీరాజనం. సాయంత్రం 4:30 – 7:30 లకు జలాధివాస సహిత క్షీరాధివాసం, రాజోపచారములు తీర్థ ప్రసాద వితరణ వుందని తెలిపారు. భక్తులు ఇంటి నుండి కలశంలో ఆలయానికి నీరు తీసుకురాగలరని కోరారు. 6, 7, 8, మూడు రోజులు మధ్యాహ్నం 1:00 – 3 గంటల వరకు మహా అన్న ప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు.ఈ మహోత్సవాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆ మహా దేవ దేవుని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని శివాలయ అర్చకులు కోరారు.

Related posts

15 నుండి ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ పరీక్షలు!

Jaibharath News

నాటు వైద్యం పేరుతో వృద్ధులకు వద్దబంగారు వస్తువులు ఎత్తుకెళ్లిన నిందితుల అరెస్టు