ఊరంతా పండగే, భక్తులతో కిటకిటలాడిన పంచలింగాల శివాలయం….
ఆడబిడ్డలు, బంధువులు భారీగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు..
భక్తి శ్రద్దలతో పంచ అమృతాలతో విగ్రహాలకు జలాభిషేకం…..
మహా మృత్యుంజయ హోమం…..
డప్పు సప్పులు మేళ తాళాలు నృత్యాలతో విగ్రహాల ఊరేగింపు….
( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ): భారతదేశంలోని ఏకైక దక్షిణముఖ పంచలింగాల శివాలయములో ప్రతిష్టాప మహోత్సవ వేడుకలకు ఆడుబిడ్డలు బంధువులు సన్నిహితులు శ్రేయోభిలాషులు మిత్రులు తరలిరావడంతో భక్తులతో కిటకిటలాడాయి. గురువారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రతిష్టాప మహోత్సవ వేడుకల్లో 2వ రోజు ఉదయము గణపతి హోమం, కలిశారాధన, విగ్రహాలకు పంచ అమృతాలతో వేద పండితు లు రవీంద్ర శర్మ,శరత్ శర్మ,శ్రవణ్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల బృందం వేద మంత్రోచ్ఛనులతో అభిషేకాలు నిర్వహించారు. ఆడిబిడ్డలు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నది జలాలు తీసుకొని దేవాలయానికి చేరుకొని అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పంచలింగాల శివాలయం నుండి విగ్రహాలను మేళ తాళాలు, డప్పు చప్పుళ్ళు,సన్నాయి వాయిద్యాలు, భక్తుల నృత్యాలతో హర హర మహాదేవ శంభో శంకర.. పార్వతీ పతయే నమః.. ఓం నమశ్శివాయ అంటూ శివనామ స్మరణతో భక్తులందరూ నగర సంకీర్తన నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పిల్లా పాపలు, వృద్ధులు, ఆడబిడ్డలు బంధువులు నూతన వస్త్రాలను ధరించి ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొని భక్తి పాటలు ఆలపిస్తూ తన్మయం చెందుతున్నారు. దసరా దీపావళి ఉత్సవాలను మైమరిపిస్తూ వెయ్యి సంవత్సరాల తరువాత పునర్నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవ వేడుకల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని శివపార్తుల అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఆత్మకూరు మండల కేంద్రమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వలనే ఈ వేడుకల్లో మేము పాల్గొంటున్నామని 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు అంటున్నారు.ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలను కల్పిస్తూ ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యం పదివేల మందికి మహా అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు జాతీయ రహదారి కావడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అడుగడుగునా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.