జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 8)
గ్రేటర్ వరంగల్ నగరంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర స్థాయి 17 సంవత్సరాల బాల బాలికల యోగా ఆసనముల పోటీలు కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ భవనంలో నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీలలో వరంగల్ జిల్లా ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుందనిఎస్ జి ఎఫ్ ఐ జిల్లా సెక్రటరీ దస్రూ నాయక్ , కన్వీనర్ బొలిశెట్టి కమలాకర్ తెలిపారు. యోగ లో బాలికల విభాగంలో నిజామాబాద్ కు చెందిన సరస్వతి, రంగారెడ్డికి చెందిన నవ్య, వరంగల్ కు చెందిన స్పందన జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారనితెలిపారు. బాలుర విభాగంలో మహబూబ్ నగర్ కు చెందిన అఖిల్, అదిలాబాద్ కు చెందిన శశివర్ధన్, కరీంనగర్ చెందిన రంజిత్, కరీంనగర్ కు చెందిన అక్షిత్ వరంగల్ చెందిన పవన్ తేజ జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారని అన్నారు ఆర్టిస్ట్ యోగా విభాగంలో నిజామాబాద్ కు చెందిన సందీప్, రిథమిక్ యోగాలో మహోన్నత్, రిథమిక్ యోగ బాలికల విభాగంలో సోహాలిక, ట్రెడిషనల్ యోగాలో స్పందన జాతీయ యోగ పోటీలకు ఎంపికయ్యారని ఎజీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దస్రూ నాయక్, కన్వీనర్ బొలిశెట్టి కమలాకర్ తెలిపారు
previous post