Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 12)
విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడికి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మీద జరిగిన దాడిని తెలంగాణ ఎన్జీఓ సంఘంగా వరంగల్ జిల్లా టిఎన్ జిఒ అధ్యక్షులు గజ్జెల రాంకిషన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి నిరసనగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12తేది నాడు జిల్లా ఉద్యోగులందరూ తెలంగాణ ఎన్జీఓ ల సంఘం నాయకత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన చేపడతారని తెలిపారు. దోషులు ఎంతటి వారైనప్పటికీ చట్ట పరిధిలో శిక్షలు విధించాలని జిల్లా అత్యున్నత అధికారైన కలెక్టర్ ప్రతీక్ మీద జరిగిన దాడి పట్ల ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పట్టికీ వాటిని పరిష్కరించుకునే మార్గం ఒకటి తప్పక ఉంటుంది, అంతే గాని చట్టాన్ని తమ చేతిలో తీసుకొని అధికారుల మీద దాడులు చేయడం హేయమైన చర్యని దానికి తెలంగాణ ఎన్జీఓల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు తెలంగాణ ఎన్జీఓ ల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదె వేణుగోపాల్ , కేంద్ర సంఘ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం జిల్లా టీఎన్జీఓ నాయకులు దాడి పట్ల ఆ సంఘం నాయకులు ప్రకటనను విడుదల జేశారు.

Related posts

వరంగల్లుకి మొదటి ఒలింపిక్ బహుమతితెచ్చిన జీవంజి దీప్తికి అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బుధరావుపేట యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఆవులపల్లి రాజు మరణం

Sambasivarao

బిజెపి ప్రచార రథాలను ప్రారంభించిన బిజెపి నాయకులు