Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర నేతల ఖండన

( జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 11)విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ని కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడికి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మీద జరిగిన దాడిని టిజిటిఎ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపు మంగళవారం 12 నాడు జిల్లా ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు అయ్యి నిరసన చేపడతారని అదే విధంగా దోషులు ఎంతటి వారైనప్పటికీ చట్ట పరిధిలో శిక్షలు విధించాలని తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు ఇక్బాల్, బండి నాగేశ్వర్ రావు, కే విక్రమ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా అత్యున్నత అధికారి అయిన కలెక్టర్ మీద జరిగిన దాడి పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం పై బాధ్యత ఉండదని, చట్టాన్ని తమ చేతిలో తీసుకొని అధికారుల మీద దాడులు చేయడం హేయమైన చర్యని దానికి టిజిటిఏ ల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర నాయకులు ముహమ్మద్ ఇక్బాల్, విక్రమ్ కుమార్ బండి నాగేశ్వర్ రావు తెలిపారు

Related posts

సమ్మక్క జాతర లో గట్టి పోలీస్ బందో బస్తు

Jaibharath News

ఒగ్లాపూర్ లో పోచమ్మ బోనాల పండుగ

Jaibharath News

నీరు కుళ్ళ శ్రీ చెన్నకేశవ స్వామి కి ఆభరణాలు