Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పంచలింగాల శివాలయం అద్భుతం

పంచలింగాల శివాలయం అద్భుత

బిజెపి పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కాళీ ప్రసాద్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
కాకతీయుల కాలంలో నిర్మించిన పంచలింగాల శివాలయం ను అద్భుతంగా పునర్ నిర్మానం చేశారని పరకాల నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి డాక్టర్ కాళీ ప్రసాద్ కొనియాడారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని కార్తీక మాస సోమవారం పురస్కరించుకొని పంచలింగాల శివాలయంలో డాక్టర్ కాళీ ప్రసాద్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బలవంతుల రాజు, ప్రధాన కార్యదర్శులు ఉప్పుగల్ శ్రీకాంత్ రెడ్డి, బయ్య పైడి కళ్యాణ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు గట్టు వేణు గౌడ్, కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి, బిజెపి జిల్లా నాయకులు రవ్వ శివప్రసాద్, భయ్యా రాజ్, ఆలయ కమిటీ బృందం పంచలింగాల శివాలయంలో విశేష పూజలను రవీంద్ర శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. దేవాలయం ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంత అద్భుతమైన దేవాలయానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని శాశ్వత కట్టడమైన ఆర్చి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఈరోజు ఇక్కడ పూజలు చేయడం నా జన్మ ధన్యమైందని దేవాలయం అభివృద్ధి కోసం నా వంతు సహకారం అందిస్తా నని అన్నారు.

Related posts

శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల శాంతి ర్యాలీ

agrampahad sammakka mini jathara అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం- వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.