Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

Kaloji కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం

జై భారత్ వాయిస్ న్యూస్ :హనుమకొండ, నవంబర్ 17 (kakathiya)
కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.
ఓరుగల్లు సిగలో మరో మందారం..మురిసిపోతున్న కళామతల్లి.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం  తేదీ ఖరారు అయ్యింది. తెలంగాణ సాంస్కృతిక రంగానికి మరింత ఒరవడిని తీసుకొస్తూ హనుమకొండలో నిర్మితమైన కాళోజీ కళాక్షేత్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నవంబర్ 19న మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కళాక్షేత్రం  4.25 ఎకరాల విస్తీర్ణంలో, 95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) పర్యవేక్షణలో పూర్తి అయింది.ఈ కళాక్షేత్రం 1.77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది.ప్రధాన ఆడిటోరియంలో 1,127 మంది సీటింగ్ సామర్థ్యం . సెంట్రలైజుడు ఎసితోపాటు అత్యాధునిక ఆడియో-విజువల్ సిస్టమ్‌లతో ఇది సాంస్కృతిక కార్యక్రమాలు, థియేటర్ ప్రదర్శనలు, ఇతర కళారంగ కార్యక్రమాలకు అనువైన వేదికగా మారనుంది.చిన్న సాంస్కృతిక సమావేశాల కోసం ప్రత్యేకంగా నాలుగు మినీ హాళ్లు ఏర్పాటు చేశారు.ఆర్ట్ గ్యాలరీ: గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాళోజీ నారాయణరావు ఫొటోలు, జ్ఞాపకాలు, పురస్కారాలు వంటి అంశాలు ఇందులో ప్రదర్శించబడతాయి.కళాక్షేత్రం ప్రారంభోత్స వానికి ముందుగా కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. అనంతరం కాళోజీ జీవితం  కళాక్షేత్రం అభివృద్ధి పై చేసిన షార్ట్ ఫిల్మ్ ను వీక్షించనున్నారు.

Related posts

బాధితుడికి మొబైల్ ఫోన్ ను అప్పగించిన పోలీసులు

పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క కు ఘన స్వాగతం

Jaibharath News

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం