జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి, వసంత బాబు అధికారులను అదేశించారు.కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి, కళ్యాణదుర్గం మండల తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, మండలం లోని అన్ని గ్రామాల వీఆర్వో లతో సమావేం నిర్వహించారు. సదరు మీటింగ్ నందు అన్ని రకాల రెవెన్యూ సబ్జెక్టు ల గురించి సమీక్షా నిర్వహించడం జరిగింది. రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ తహశీల్దార్ ఇతర కార్యాలయపు సిబ్బంది అందరూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను అదేశించారు.