(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం నాడు ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్, మండల కన్వీనర్ బి.సోమయ్య సారధ్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు మాట్లాడుతు నేటి కాలంలో మన చుట్టూ అనేక అంశాలు మనల్ని మోసగించడానికి తొంగి చూస్తున్నాయి కాబట్టి ఈ సమయాల్లో తార్కిక ఆలోచన, వాస్తవాలను గ్రహించడం ద్వార మాత్రమే మనల్ని మనం కాపాడు కోగాలుగుతాము అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి మాట్లాడుతు జనవిజ్ఞాన వేదిక గత మూడు దశాబ్దాలుగా ప్రజలలో మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం సైన్స్ టాలెంట్ టెస్ట్ లు నిర్వహించడం అభినందనీయం అన్నారు.
జిల్లా స్థాయికి ఎంపికైన పాఠశాలల వివరాలు ప్రభుత్వ పాఠశాలల విభాగంలో
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అక్కంపేట విద్యార్థులు ఎస్.జస్వంత్, వి.మహేష్, వై.సాయిచందు.
రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో
మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు జి.శ్రావిక, టి.వర్షిత, కే.ఐశ్వర్య. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో
విశ్వ భారతి హై స్కూల్ ఆగ్రాంపాడు విద్యార్థులు బి.వరుణ్ తేజ్,జి.లక్ష్మణ్, పి.మణికంఠ. గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం జరిగినది.
జిల్లాకు ఎంపికైన విద్యార్థులు ఈనెల 28వ తేది గురువారం నాడు శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో చెకుముకి మండల కన్వీనర్ బి సోమయ్య, వివిధ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు వేమారెడ్డి, రాజు, శ్రీదేవి, రామచంద్రరావు, వనజ,చైతన్య, శ్రీనివాస్, పుష్పమ్మ, మహేష్, సతీష్, రవీందర్ తదితరులు హాజరయ్యారు.
previous post