Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నాటు వైద్యం పేరుతో వృద్ధులకు వద్దబంగారు వస్తువులు ఎత్తుకెళ్లిన నిందితుల అరెస్టు

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు నవంబర్ 22)
: నాటు వైద్యం పేరుతో మాయ మాటలు చెప్పి వృద్ధ దంపతులను బూరడి కొట్టించి వృద్ధ మహిళ మెడలోని రెండున్నర తులాల పుస్తెలతాడు అర్థతులం చెవి కమ్మలు ఎత్తుకెళ్లిన సంఘటన ఆత్మకూరు మండలంలో ని పెంచికలపేట గ్రామంలో 20 రోజుల క్రితం చోటుచేసుకుంది ఆత్మకూరు సిఐ సంతోష్ ఆధ్వర్యంలో 20 రోజుల్లో దర్యాప్తు నిర్వహించి నిందితులను పట్టుకుని రిమాండ్ తరలించారు. పరకాల ఏసీపి కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా ఇందిరానగర్ కి చెందిన ముదిర్నే రత్నకుమార్ అలియాస్ పుల్లయ్య అతని భార్య ముదిర్నె రత్నకుమారి ఆలియా శాంతి, చిక్కు వెంట్రుకలు మూలికా వైద్యం స్టీలు సామాన్లు విక్రయాలు జరుపుతూ ఇటీవల కొంత కాలం గా నర్సంపేట మండలం ముత్తోజుపేట గ్రామంలో నివసిస్తున్నారు. చిక్కు వెంట్రుకల వ్యాపారంలో భాగంగా రత్నకుమారి ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామానికి వచ్చి చిక్కు వెంట్రుకలు కొంటామంటూ గ్రామంలో తిరుగుతుండగా రత్న కుమారికి వృద్ధ జంట తారసపడింది. వృద్ధ మహిళ మెడలోని బంగారు వస్తువులపైన కన్నేసిన రత్నకుమారి వాటిని ఎలాగైనా చేతికించుకోవాలని పన్నాగం పన్ని వృద్ధులకు ఆరోగ్యం సక్రమంగా ఉండటం లేదని చేతబడి చేసి ఉంటారని తనకు తెలిసిన వ్యక్తి చేతబడి నయం చేస్తాడని మాయమాటలతో వృద్ధులను నమ్మించింది. అక్కడి నుండి ఇంటికి వెళ్లిన రత్నకుమారి భర్త రత్నకుమార్ కు వృద్ధ దంపతుల వివరాలను తెలియజేయా గా ఈనెల 12వ తేదీన ఉదయం మండలంలోని పెంచికలపేట గ్రామానికి చేరుకున్న రత్నకుమార్ వైద్యం చేస్తామంటూ వృద్ధ దంపతుల ఇంటికి చేరుకొని చేతబడి పోవాలంటే ఒంటి పైన ఉన్న బంగారు ఆభరణాలు తీసి ఇస్తే పూజ చేస్తానని తనతో తెచ్చుకున్న స్టీల్ డబ్బాలో పుస్తెలతాడు, చెవి కమ్మలు సుమారు మూడు తులాల తూకం కలవి అందులో వేసి వృధా దంపతుల కళ్ళు కప్పి నగలు వేసిన డబ్బాను తన బ్యాగ్ లో పెట్టుకొని కాలి డబ్బాలో బియ్యం పోసి వృద్ధ దంపతులకు పూజ చేశానని మధ్యాహ్న వరకు తెరవకుండా ఉంచాలని చెప్పి అక్కడ నుంచి ఊడయించాడు. అపహరించిన సొమ్ములను ములుగు లో అమ్మేందుకు రతన్ కుమార్ రత్నకుమారి టీవీఎస్ ఎక్సెల్ ఏపీ Az4224 నెంబర్ గల వాహనంపై వెళుతుండగా వారిని వాళ్లని పట్టుకొని సొమ్ములను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఆయన తెలిపారు కేసు చేదించి నిందితులను పట్టు కోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై పరమేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు, కానిస్టేబుళ్లు ఏ రమేష్ బి రమేష్ ల అభినందించి రివార్డును అందజేశారు.

Related posts

దామెర మండలంలో రక్షాబంధన్  వేడుకలు

ఏలాంటి ఆపద సమయాల్లోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొల్లోనిపల్లి ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య

Jaibharath News