April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
హనుమకొండ: సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈ నెల 30వ తేదీ నాటికి ఆన్ లైన్ లో నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేయడంపై ఎంపీడీవోలు, ఎంపీఓ, ఎంపీఎస్వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు శనివారం 23 నుండి 30వ తేదీ వరకు వివరాల నమోదును పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సర్వే పత్రాలను భద్రంగా భద్రపరచాలన్నారు. సర్వే పత్రాల భద్రత విషయంలో సూపర్వైజర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈడీఎం శ్రీధర్, ఎంపిడివోలు, ఎంపీఓలు, ఎంపీ ఎస్ ఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ ఆత్మను మేల్కొలిపిన వ్యక్తి అందెశ్రీ

ఓబీసీ సాధన సభ విజయవంతం చేయాలి

Jaibharath News

స్వయం ఉపాధి తో యువత రానించాలి

Jaibharath News