(జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్23)
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మోడీ నాయకత్వంలోనే దేశ క్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతోనే మహారాష్ట్ర లో విజయానికి నిదర్శనమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. మహారాష్ట్ర లో బీజేపీ విజయఢంకా మోగించడంతో.. గంట రవికుమార్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో సంబురాలు బీజేపీ నాయకులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ ప్రధాని మోడీకి ఉన్న పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదన్నారు. మోడీ పాలనలోనే భారత్ అంతర్జాతీయంగా మరింత బలోపేతం అవుతుందని నమ్ముతున్నారని చెప్పారు. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వన్ని స్థాపించడంతో షిండే వర్గం వారిని వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీతో ప్రభుత్వన్ని స్థాపించింది. ఇప్పుడు ప్రజలు ఇదే సరైన నిర్ణయం అని బీజేపీ కూటమి ప్రభుత్వన్ని భారీ విజయంతో గెలిపిచ్చారని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ వైపు వున్నరని మహారాష్ట్ర ఫలితాలు రుజువు చేసాయి. పేదరికం, అవినీతి, ఉగ్రవాదం వంటి పీడల నుంచి విముక్తి పొందిన నవభారత నిర్మాణం కోసం యజ్ఞం చేస్తున్న భరతమాత ముద్దుబిడ్డ మోడీ అని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా.. అబండాలు మోపినా ప్రజలు మోసపోలేదన్నారు. బీజేపీకి పట్టం మహారాష్ట్ర రాష్ట్రా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీచ రాజకీయాలు మానాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పటికైనా ఆయన కండ్లు తెరిచి మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒక్క గ్యారెంటీని సక్రమంగా అమలు చేయకుండా.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం లో అమలు చేశామని చెప్పిన తెలంగాణా సీఎంకు ప్రజలు కర్రకాల్చి వాతపెట్టరాన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్, షా, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, మాచర్ల దీన్ దయాల్, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు బైరి మురళి కృష్ణ, జిల్లా కార్యదర్శి గోకె వెంకటేష్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సూరజ్ గౌడ్, పలు డివిజన్ అధ్యక్షులు మరియు పెద్ద ఎత్తున బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొని సంబరాలు చేశారు.